టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.సుధీర్ బాబు మూడు విభిన్న గెటప్‍ల్లో కనిపించి ఈ చిత్రంలో ప్రతి పాత్రలో కూడా అద్భుతంగా నటించాడు.ఆయన త్రిపాత్రాభినయం చేయటం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై బాగా క్రేజ్ ఏర్పడింది. అయితే, థియేటర్లలో మాత్రం మామా మశ్చీంద్ర అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆశించిన మేర కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేందుకు మామా మశ్చీంద్ర సినిమా రెడీ అయిందిమామా మశ్చీంద్ర సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తుంది. అక్టోబర్ 20వ తేదీన ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (అక్టోబర్ 16) అధికారికంగా ప్రకటించింది. “మాయ చేసేందుకు వచ్చేస్తున్నాడు. రెడీయేనా మీరు అందరూ. మామా మశ్చీంద్ర అక్టోబర్ 20న ఆహాలో ప్రీమియర్ అవుతుంది” ఆహా ట్వీట్ చేసింది. మరోవైపు, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో కూడా అదే రోజు మామా మశ్చీంద్ర స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఇలా ఈ మూవీ రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమ్ కానుంది..
మామా మశ్చీంద్ర చిత్రానికి హర్ధవర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఎంతో విభిన్నంగా ఇంట్రెస్టింగ్‍గా ఉన్నా తెరకెక్కించి విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదని కొందరు అభిప్రాయపడ్డారు. మొదటి షో నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే మరిన్ని సినిమాలు పోటీలో ఉండటంతో మామా మశ్చీంద్ర ఆశించిన స్థాయిలో థియేటర్లలో ఆడలేదు.మామా మశ్చీంద్ర సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్‍గా ఈషా రెబ్బా నటించారు.అలాగే మృణాళిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, మిర్చి కిరణ్, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ మరియు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని గ్రాండ్ నిర్మించారు. సుధీర్ బాబు ఈ చిత్రంలో. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు క్యారెక్టర్లలో కనిపించారు. పరుశురామ్ పాత్ర నెగెటివ్‍గా ఉంటుంది. ఈ సినిమా తన కెరీర్లో అత్యుత్తమంగా నిలిచిపోతుందని, ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని ప్రమోషన్ల సమయంలో సుధీర్ ఎంతగానో చెప్పారు. అయితే, సినిమా కథ విభిన్నంగా ఉన్నా కూడా కథనం మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్ గా సాగడం తో ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు