NTV Telugu Site icon

Vijayashanti : బీజేపీకి బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి విజయశాంతి..?

Vijayashanthi

Vijayashanthi

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. నిన్నటితో నామినేషన్లకు గడువు కూడా ముగిసింది. అయితే.. టికెట్లు రాని కొందరు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ సీనియర్‌ నాయకురాలు విజయశాంతి సైతం బీజేపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విజయశాంతి బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా కనపించడం లేదు. ట్విట్టర్‌ వేదికగా మాత్రమే ఆమె తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై వివరణ ఇస్తూ.. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారి ఇప్పుడు బీజేపీ చేరితే వారితో ఆ సమావేశంలో కూర్చోలేకపోయానని వ్యాఖ్యానించారు.

Also Read : Earthquake: ఢిల్లీలో 2.6 తీవ్రతతో భూకంపం..

ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రాములమ్మ తాజాగా కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ.. డిసెంబర్ 9న మొదటి క్యాబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు. ఇచ్చిన గ్యారంటీస్ 100 రోజుల్లో అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. తాజాగా వస్తున్న సర్వేలు వార్ వన్ సైడ్ కాంగ్రెస్ వస్తుందని చెబుతున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కంటోన్మెంట్ లో గద్దర్ కూతురు వెన్నెల ని గెలిపించడానికి కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని, విజయశాంతి లాంటి వారు కాంగ్రెస్ కి వస్తున్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : Duddilla Sridhar Babu : సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం