Site icon NTV Telugu

Mallu Ravi : కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

Mallu Ravi

Mallu Ravi

కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో నీటి సమస్యలు చాలా కీలకమన్నారు. కృష్ణ జలాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరుకాకపోవడం ప్రజలను అవమనపరిచినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ రాకుండా బయట ఎక్కడో మాట్లాడ్డం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎంత సేపు మాట్లాడిన అవకాశం ఇస్తామని చెప్తున్న రాకుండా మొఖం చాటేయ్యడం దారుణమని, ఆయన నల్గొండలో కృష్ణ జలాల గురించి సభ పెట్టి మాట్లాడ్డం ఏమిటి అని మల్లు రవి మండిపడ్డారు.

Kumari Aunty: మొన్న అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే..?

అసెంబ్లీ ఏమి చెప్పాలో అది చెప్పండని, కృష్ణ జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు, బిఅరఎస్ కు లేదన్నారు మల్లు రవి. కృష్ణ జలాలను పెద్దఎత్తున ఆంధ్ర తరలింపు చేస్తుంటే కేసీఆర్ చూస్తూ కూర్చున్నారని, కేఆర్ఎంబీ విషయంలో ప్రజాలను తప్పుదోవ పట్టిస్తూ వాస్తవాలను పక్కన పెడుతున్నారన్నారు. మీరు ఎన్ని చెప్పిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. . కృష్ణ జలాలను పెద్ద ఎత్తున ఆంధ్ర తరలింపు చేస్తుంటే కేసీఆర్ చూస్తూ కూర్చున్నారన్నారు. కేఆర్ఎంబీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాస్తవాలను పక్కన పెడుతున్నారన్నారు.

Pushpa The Rule: సింహంతో సుక్కూ.. ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన రష్మిక

Exit mobile version