Site icon NTV Telugu

Mallu Ravi : బీజేపీ పార్టీ పుట్టకముందే హిందు మతం ఉంది

Mallu Ravi Cyber Crime Enqu

Mallu Ravi Cyber Crime Enqu

మరోసారి బీజేపీపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వాళ్ళది హిందు ఏక్తా యాత్ర కాదు.. హిందువులను విడగొట్టే యాత్ర అని ఆయన ధ్వజమెత్తారు. కరీంనగర్ లో నిన్న బీజేపీ.పెట్టిన హిందు ఏక్తా యాత్ర హిందువుల మద్య చిచ్చు పెట్టె యాత్ర లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పుట్టకముందే హిందు మతం ఉందని, అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు. హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదని ఆయన అన్నారు. బీజేపీ మతం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ హిందువుల మధ్య చిచ్చు పెడుతుందని ఆయన ఆరోపించారు. హిందువుల ఏక్తా యాత్ర అంటూ బీజేపీ హిందువుల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ఆయన మండిపడ్డారు.

Also Read : Benefits Of Litchi Friut : లిచ్చి యొక్క 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

కాంగ్రెస్ లోనే కాదు అన్ని పార్టీ లలో హిందువులు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారని, వాళ్ళు కూడా దేవుళ్లను పూజిస్తారన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తే అవ్వి ఎప్పటికి ఫలించవని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముడిని, హనుమంతుడిని, శంకరుడిని, భాగ్యలక్ష్మిని అందరినీ పూజిస్తారన్నారు. హిందు మత సంప్రదాయాలు బీజేపీ పుట్టిన తర్వాత రాలేదని, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయన్నారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షులు అయ్యాక కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు నడిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి చాలాకాలం రాజకీయాలు నడపలేరని, ప్రజలు బీజేపీ మత రాజకీయాలు గమనిస్తున్నారని, తగిన విధంగా బుద్ధి చెవుతారని మల్లు రవి అన్నారు.

Also Read : Snake House: అది ఇల్లు కాదు.. పాముల పుట్ట.. కష్టపడి ఇల్లు కొనుగోలు చేస్తే..

Exit mobile version