Site icon NTV Telugu

Mallu Ravi : జనాభా ప్రకారం టికెట్ కావాలని బీసీలు అడగడం న్యాయమే

Mallu Ravi

Mallu Ravi

జనాభా ప్రకారం టికెట్ కావాలని బీసీలు అడగడం న్యాయమే అన్నారు మల్లు రవి. ఆదిలాబాద్‌లో ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. నిన్న బీసీలు పెట్టిన సమావేశంలో బీసీ గణనమీద అని, కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు పనిచేస్తే వారికే టికెట్లు అన్నారు. బీసీ గణన మీద మోడీకి లెటర్ రాయించినందుకు ధాన్యవాదానాలు తెలిపే సమావేశం అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కులాల మీద నిలబడే పార్టీ కాదని, మతం మీద పనిచేసే పార్టీ కాదని మల్లు రవి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ చెప్పేది ఓటి చేసేది ఓటి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రైతులు ఇంత నష్టపోతే పట్టించుకునే వాళ్లు లేరని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ అంటే ఇచ్చిన హమీ నెరవేర్చకపోవడమేనా అని ఆయన ప్రశ్నించారు. సీఎం ఇచ్చిన హమీలు నెరవేర్చింది ఏంటీ.. వర్షాలతో నష్టపోతే రైతులను పలకరించిన వారు లేరని ఆయన దుయ్యబట్టారు.

Also Read : Agent: హిట్ అయిన ప్రతి సినిమాకూ డబ్బులొస్తాయని చెప్పలేం: అనిల్ సుంకర

ఇదిలా ఉంటే.. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకుంది. ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బొల్లెపల్లి కృష్ణను వేదిక మీదకు పిలవాలని ఆయన వర్గీయులు నిరసన తెలపడంతో.. కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిరవర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీంతో భట్టి కలుగజేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.

Also Read : Payment with Credit Card: క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 20 శాతం ఎక్కువ

Exit mobile version