150 మందిపై ఉపా కేసు పెట్టడం దుర్మార్గమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళ మీదనే కేసులు పెట్టారన్నారు మల్లు రవి. మానవ హక్కులపై ఐపీఎస్, ఐఏఎస్‌లకు పాఠాలు చెప్పిన వ్యక్తి హరగోపాల్ అని ఆయన అన్నారు. ప్రజల తరపున మాట్లాడే గొంతుకలపై కేసులు పెడుతోందని ఆయన మండిపడ్డారు. ఉపా కేసులు ఎత్తివేస్తాం అని కాంగ్రెస్ స్పష్టం చేసిందని, కేసీఆర్ ఇప్పుడేదో కేసు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పారన్నారు. మీకు తెలియకుండా పోలీసులు కేసు పెడతారా అని ఆయన ధ్వజమెత్తారు. అలా జరిగితే కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నక్సలైట్ల అజెండా మా అజెండా ఒక్కటే అన్న కేసీఆర్ ఇప్పుడు కేసులు ఎలా పెడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Money Missing: ప్రింట్ అయ్యాయి కానీ.. ఆర్బీఐకి చేరలేదు.. రూ.88వేల కోట్లు మిస్సింగ్.. !
అయితే.. ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరులపై పెట్టిన ఉపా కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డీజీపీ అంజనీ కుమార్ ని ఆదేశించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద కేసు నమోదు చేశారు పోలసుది. దీన్ని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితమే పెట్టినా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇదీ కాస్త చర్చనీయాంశంగా మారింది. మొత్తం 152 మందిపై కూడా అభియోగాలు దాఖలయ్యాయి. ఉద్యమకారులు, మేధావులు, హక్కుల నేతలపై ఉపా కేసులు నమోదయ్యాయి. ప్రొఫెసర్ హరగోపాల్, విమలక్క, గడ్డం లక్ష్మణ్ తో పాటు ప్రజాసంఘాల నేతలు, మేధావులు, విద్యార్థి నాయకులు పేర్లు ఇందులో ఉన్నాయి.
Also Read : Adipurush: ఆదిపురుష్‌పై ఆప్ వర్సెస్ బీజేపీ.. మనోభావాలు దెబ్బతీశారని ఆరోపణ.
