NTV Telugu Site icon

Mallikarjun Kharge: తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Karge

Karge

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైతులపై మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలతో వేధిస్తే.. కాంగ్రెస్ కిసాన్ న్యాయ్ కు కట్టుబడి ఉందన్నారు. రైతు రుణమాఫీ పై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు.

Read Also: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

ఇక, 16 సంవత్సరాల క్రితం, కాంగ్రెస్-యూపీఏ ప్రభుత్వం 3.73 కోట్ల మంది రైతులకు సంబంధించిన 72 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాఫీ చేశామని గుర్తు చేశారు. ఒక వైపు మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులపై మూడు నల్ల చట్టాలను విధించి, ముళ్ల తీగలు, డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లాఠీ దెబ్బలతో వెధిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ “కిసాన్ న్యాయ్” కింద సరసమైన ధరలు, రుణమాఫీ కమిషన్, బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ లాంటి న్యాయమైన వ్యవసాయ దిగుమతి- ఎగుమతి పాలసీకి హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. మా ఈ ఎజెండా చెక్కు చెదరకుండా ఉంటుందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.