NTV Telugu Site icon

Malla Reddy: హైకోర్టు మెట్లెక్కిన మల్లారెడ్డి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం

Malla Reddy

Malla Reddy

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కేశవాపురం గ్రామంలో భూకబ్జా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదైన కేసును కొట్టివేయాలని మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ కె. సురేందర్‌ ముందు విచారణకు వచ్చింది. అయితే ప్రజాప్రతినిధుల కేసును విచారిస్తున్న ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Read also: Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. కొంచెం ఓపిక పట్టండి

మల్లారెడ్డి, అనుచరులపై భూకబ్జా కేసులు..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గతవారం కేసు నమోదైన విషయం తెలిసిందే.. గిరిజనుల భూములు ఆక్రమణకు గురయ్యాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలాల్లోని కేశవరం గ్రామంలో లంబాడీలకు చెందిన సర్వే నంబర్ 33, 34, 35లో 47 ఎకరాల 18 గుంటలు. తమకు సంక్రమించిన భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన 9 మంది అనుచరులు కుట్రతో మోసం చేసి అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఈ మేరకు సమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read also: Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. కొంచెం ఓపిక పట్టండి

లంబాడీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన 9 మంది బినామీ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకుని కబ్జాకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, ఆయన అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్‌రెడ్డి, కేశవపూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త గోనె హరిమోహన్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ను పోలీసులు విచారించారు. సొసైటీ, సమీర్‌పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై సమీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటింగ్ కేసు నమోదైంది.
Salaar Bookings: టైమ్ దగ్గర పడుతోంది… ఇంకెప్పుడు మావా?