సలార్ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కొన్ని చోట్ల టికెట్లు కూడా దొరకడం లేదు కానీ అసలైన చోటే ఇంకా బుకింగ్స్ స్టార్ట్ అవలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ అంతా… సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా? లేదా? అనే బుకింగ్స్ యాప్స్‌ను చెక్ చేస్తునే ఉన్నారు కానీ బుకింగ్స్ మాత్రం చూపించడం లేదు. దీంతో ఇంకెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి… అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రిలీజ్‌కు కనీసం నాలుగైదు రోజులు ముందు బుకింగ్స్ ఓపెన్ అయితే… టికెట్లు దొరికేవి ఇప్పుడు రిలీజ్‌కు ఒక్క రోజు ముందు ఓపెన్ అయితే దొరికే ప్రసక్తే లేదు. బుకింగ్స్ యాప్స్ సర్వర్లన్నీ క్రాష్ అయిపోవడం ఖాయం. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ అవపోవడానికి కారణం… ఇంకా టికెట్ రేట్స్, స్పెషల్ సోష్ విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడమే.
ట్రిపుల్ ఆర్ టికెట్ రేట్లతో పాటు… అర్థరాత్రి ఒంటిగంట షోకి పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో టికెట్ రేట్స్ పెంచమని రిక్వెస్ట్ పెట్టారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకొన్ని గంటల్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేటును 50 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో కూడా ఈ రోజు చర్చలు ముగుస్తాయని తెలుస్తోంది. దీంతో… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు లేదా రేపటి నుంచి సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరి సలార్ టికెట్ రేట్లు ఎంత పెడతారు? అనేది చూడాలి.