Site icon NTV Telugu

Malla Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై.. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్..

Malla Reddy

Malla Reddy

అది కాలేజ్ ఫంక్షన్ అయినా సరే, పార్టీ మీటింగ్స్ అయినా సరే మల్లా రెడ్డి పాల్గొన్నారంటే ఆ కిక్కే వేరు. కిర్రాక్ స్టెప్పులు వేస్తూ కార్తకర్తల్లో జోష్ నింపుతుంటారు. మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో అతరిస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మరోసారి స్టెప్పులేశారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు.

Also Read:Vajra Super Shot: ఐపీఎల్లో మరింత భద్రత పెంపు.. రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”

అక్కడి నుంచి సభా వేదికకు చేరుకుని మాస్ డ్యాన్స్ కేరింతలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. గాయ‌కుల పాట‌ల‌కు ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపారు. స‌భా వేదిక‌పై ఉన్న నేత‌లంతా కూడా మ‌ల్లారెడ్డితో క‌లిసి కాలుకదిపారు. దీంతో జై మ‌ల్లన్న, జై తెలంగాణ అనే నినాదాల‌తో మార్మోగిపోయింది. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ తో సభా ప్రాంగణం వద్ద ఉన్న జోష్ రెట్టింపయ్యింది.

Exit mobile version