Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా పరిచయాలు పెంచుకుని, మత్తుమందు ఇచ్చి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, చందు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మీడియాకు వెల్లడించారు.
నిందితులు ‘గ్రైండర్’ (Grindr) డేటింగ్ యాప్ ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా యాప్‌లో ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడుతూ పరిచయం పెంచుకునేవారు. ఈ క్రమంలో బాధితులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? వారి వద్ద బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్నాయా? అనే వివరాలను ముందే ఆరా తీసేవారు. బాధితులకు పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత వారి ఇళ్లకు వెళ్లేవారు. అక్కడ మద్యం సేవించే సమయంలో బీర్లో మత్తు పదార్థాలు కలిపి బాధితులకు ఇచ్చేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యేవారు.
Also Read
- UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
- Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
- Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
- Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు పట్టుకోగా, ఏఎస్ రావు నగర్లో మరో ఇద్దరిని కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుల నుంచి సుమారు 361 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాపై మొత్తం 14 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 2, సైబరాబాద్‌లో 7, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నిందితుల మొబైల్ ఫోన్లు, గ్రైండర్ యాప్ ప్రొఫైల్స్, చాటింగ్స్, కాల్ డేటా ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చందు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
-
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!