Male vs Female Capsicum: క్యాప్సికమ్‌లో ఆడ, మగ ఉంటాయా? ఉంటే ఏది వంటకు.. ఏది సలాడ్‌కు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Male vs Female Capsicum: సాధారణంగా మనం మార్కెట్లో క్యాప్సికమ్ కొనేటప్పుడు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటిని బాగా గమనిస్తే.. వాటి అడుగు భాగంలో ఉండే బుడిపెల (Bumps) సంఖ్యలో తేడాలు గమనించవచ్చు. ఈ తేడాల ఆధారంగానే వీటిని మగ (Male), ఆడ (Female) క్యాప్సికమ్ లుగా పిలుస్తుంటారు. ఆకృతిలో ఉండే స్వల్ప మార్పుల వల్ల వంటల్లో వీటిని వేర్వేరు పద్ధతుల్లో ఉపయోగిస్తారు. మరి ఆ తేడాలాంటి.. అసలు ఎందుకు వాటిని ఎలా ఉపయోగిస్తారంటే..
Limited Edition : Xiaomi 65 ఇంచుల Smart TVపై రూ.32,000 భారీ తగ్గింపు.. డీల్ సెల్లింగ్ ఫాస్ట్.!
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
మగ (Male) క్యాప్సికమ్:
క్యాప్సికమ్ అడుగు భాగంలో మూడు బుడిపెలు మాత్రమే ఉంటే దానిని ‘మగ’ (Male) క్యాప్సికమ్ గా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా కొంచెం పొడవుగా ఉండి, లోపల విత్తనాలను తక్కువగా కలిగి ఉంటాయి. వీటి రుచి విషయానికి వస్తే.. కాస్త ఘాటుగా ఉండి పచ్చిగా తినడానికి అంత రుచిగా ఉండవు. అయితే వేడి చేసినప్పుడు ఇవి తమ రుచిని, ఆకారాన్ని నిలుపుకుంటాయి. అందుకే వీటిని కూరలు వండటానికి, ఫ్రైలు చేయడానికి లేదా పిజ్జాల మీద ట్యాపింగ్స్ గా ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ఆడ (Female) క్యాప్సికమ్:
క్యాప్సికమ్ అడుగు భాగంలో నాలుగు బుడిపెలు ఉంటే దానిని ‘ఆడ’ (Female) క్యాప్సికమ్ గా పిలుస్తారు. ఇవి వెడల్పుగా, కాస్త లావుగా కనిపిస్తాయి. వీటిలో విత్తనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రకం క్యాప్సికమ్‌లు సహజంగానే తీపి గుణాన్ని కలిగి ఉండి, మెత్తగా ఉంటాయి. ఇవి పచ్చిగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి సలాడ్లలో ముక్కలుగా కోసి తినడానికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉడికించడం కంటే పచ్చిగా వాడటమే మంచింది.
Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
వంటల పరంగా ఈ తేడాలు ఉపయోగపడినప్పటికీ.. వృక్షశాస్త్రం (Botany) ప్రకారం క్యాప్సికమ్‌లో ఆడ, మగ అనే లింగ భేదాలు ఉండవు. క్యాప్సికమ్ అనేది మొక్కకు కాసే ఒక కాయ మాత్రమే. ఈ బుడిపెలలో తేడా అనేది కేవలం ఆ విత్తనం రకం, కాయ పెరిగిన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!