Maldives: దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు.. తాజా నిర్ణయమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తత్వం బోధపడితేనే గాని బుద్ధిరాదంటూరు పెద్దలు. ఈ సూత్రం మాల్దీవులకు కరెక్ట్ సరిపోతుంది. చైనా అండ చూసుకుని భారత్‌తో మాల్దీవులు కయ్యానికి దిగింది. దీంతో మాల్దీవులకు ప్రధాన ఆర్థికవనరు అయిన పర్యాటకరంగం ఒక్కసారిగా కుదేలైంది. ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగలడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాళ్లబేరానికి దిగొచ్చింది. ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశం అయ్యారు. భారత్‌లో ముఖ్యమైన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతి ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. తిరిగి భారతీయ పర్యాటకులను రప్పించేందుకు ప్రచారం నిర్వహిస్తామని కోరారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు భారత హైకమిషనర్‌కు విన్నవించారు.
Also Read
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..

మాల్దీవులకు భారత్ కీలకమైన ఆర్థికవనరుగా ఉంది. ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్‌లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని ట్రావెట్స్ సంస్థ పేర్కొంది. ఇండియాలో కీలకమైన ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెట్స్ సంస్థ తెలిపింది.
మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్ (66,999), రష్యా (66,803), ఇటలీ (61,379), జర్మనీ (52,256), భారత్ (37,417)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ఇటీవల ప్రధాని మోడీ కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యదీప్‌ను సందర్శించి.. భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యాటకరంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవులు.. మోడీపై అక్కసు వెళ్లగక్కారు. అవమానకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేస్తున్నారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం భారతీయ పర్యాటకుల సంఖ్య మరింత పడిపోవడంతో మాల్దీవులు కాళ్లబేరానికి దిగొచ్చింది.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!