President Mohammad Muizzu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు. ఇది ఆయనకు మొదటి విదేశీ పర్యటన’.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జూ వెళ్లారు. అధ్యక్షుడు ముయిజ్జూతో పాటు మాల్దీవుల ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా చైనాకు వెళ్లింది. కాగా, మాల్దీవుల( Maldives ) అధ్యక్షుడు ముయిజ్జు వారం రోజుల పాటు చైనా పర్యటనలో ఉండనున్నారు.
Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు కొత్త ఆరోగ్య సమస్య.. ఐపీఎల్ 2024కు దూరం!
అయితే, భారతదేశంతో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అంశాన్ని భారత హైకమిషన్ లేవనెత్తడంతో ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది. మాల్దీవులకు ( Maldives ) ప్రత్యామ్నాయ పర్యాటక కేంద్రంగా కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ను చూపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మాల్దీవుకు చెందిన మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు.
Read Also: Warangal: ఎనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత.. మిర్చి ధరలు తగ్గించారని రైతన్న ఆగ్రహం..
కాగా, మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలు భారతదేశంలో విమర్శలకు దారితీశాయి. పలువురు ప్రముఖులు మాల్దీవులకు వెళ్లకుండా దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కొంత మంది భారతీయులు మాల్దీవులకు (Maldives ) తమ షెడ్యూల్డ్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారనే విషాయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.