Malayalam Actresses: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ హీరోయిన్లకి ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉండనే ఉంటుంది. అందుకే కాబోలు.. ఎప్పటికప్పుడు కొత్త కేరళ గ్లామర్ టాలీవుడ్ లో కొనసాగుతునే ఉంటుంది. ఇక అలా క్లిక్ అయిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఆమెతో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా కూడా మరోసారి జీగేలు అంటారా? అలాగే సీనియర్ యాక్ట్రెస్ నయనతార ఇలా అందరూ ఒక్కో సినిమాతో టాలీవుడ్ లో వారి హవా కొనసాగిస్తున్నారు.
రీసెంట్ గా పరదాతో సూపర్ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది అనుపమ పరమేశ్వరన్. అయితే ఈ సినిమా కొంతమందికి నచ్చిన థియేటర్స్ కి మాత్రం జనాలు రాలేదు. రివ్యూస్ బాగున్నా.. ఆ సినిమా పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయకపోయినా, తర్వాత సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కిష్కిందపురి మీద గట్టి హోప్స్ పెట్టుకుంది. చిన్నతనం నుంచి తనకు హారర్ సినిమాలు అంటే ఇష్టమని ఇప్పుడు కిష్కిందపురి అలాంటి సినిమానే అని ఆమె అన్నారు. ఇలా పర్ఫెక్ట్ మూవీ కోసం అనుపమ ట్రై చేస్తుంటే.. సైలెంట్ గా వచ్చి సక్సెస్ అయ్యారు కళ్యాణి ప్రియదర్శి.
Revanth Reddy: సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు.. మూసీ మాత్రం జరగొద్దా?
కొత్తలోక సినిమా సూపర్ సక్సెస్ కావడంతో కళ్యాణి హవా పెరిగింది. మంచి కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటుంది కళ్యాణి. తనను మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారని, తనపై మొదటిగా ప్రేమ చూపించింది తెలుగు ఆడియన్స్ అని అన్నారు. తెలుగులో మంచి సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్న, సరైన కథ దొరకలేదని చెప్పారు కళ్యాణి. ఇక సీనియర్ నయనతార కూడా మెగాస్టార్ చిరంజీవి పక్కన మన శంకరప్రసాద్ గారు పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే.