Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aparna Das And Deepak Parambol Get Married: మలయాళీ భామ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాదించిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్ని ఆమె పెళ్లి చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో అపర్ణ, దీపక్‌ల వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
అపర్ణ దాస్ తన పెళ్లికి తెలుపు మరియు బంగారం కలయికలో ఉన్న చీరలో మెరిశారు. భారీ ఎంబ్రాయిడరీతో ఉన్న ఆకుపచ్చ బ్లౌజ్, బంగారు ఆభరణాల మధ్య అపర్ణ చాలా అందంగా ఉన్నారు. మరోవైపు వరుడు దీపక్ పరంబోల్ మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అపర్ణ, దీపక్ జంట చుడముచ్చగా ఉంది. అపర్ణ, దీపక్ కలిసి ‘మనోకరం’ మూవీలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఇరు కుటుంబసభ్యులు అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
2018లో ‘న్యాన్ ప్రకాషన్’ సినిమాతో అపర్ణ దాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దాదా’ మూవీలో హీరోయిన్గా ఆకట్టుకున్న ఆమెకు.. విజయ్ ‘బీస్ట్’ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు అపర్ణ దగ్గరయ్యారు. ప్రస్తుతం అపర్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణకు చిన్నప్పటినుంచి సినిమాల మీద మక్కువ. దీపక్ పరంబోల్పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!