Malavika Mohanan : రూమర్లకు మాళవిక మోహనన్ చెక్.. ‘ది రాజా సాబ్’ స్టంట్స్ నావే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్ గత చిత్రాలైన ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సీరియస్ యాక్షన్ సినిమాల తర్వాత, ఆయన నుంచి వచ్చిన ఒక కంప్లీట్ హారర్ – ఫాంటసీ కామెడీ చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపించాడు. డార్లింగ్ కి జోడిగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీలోని ఒక యాక్షన్ ఎపిసోడ్‌లో మాళవిక తన స్టంట్స్ తాను చేయలేదని, ఆమెకు బదులుగా ఒక స్టంట్ డబుల్ (బాడీ డూప్) చేశారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో ఒక వ్యక్తి మాళవిక తరహా డ్రెస్ వేసుకుని ఉన్న ఫోటో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. దీంతో తాజాగా ఈ రూమర్స్ పై మాళవిక వెంటనే స్పందించారు.
సెట్స్‌లో తాను స్వయంగా రోప్ సాయంతో కష్టమైన ఫైట్స్ చేస్తున్న బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలను ప్రూఫ్స్‌గా షేర్ చేశారు. “నేను నా స్టంట్స్ నేనే చేశాను. సినిమాల్లో రిస్కీ షాట్స్ చేసేటప్పుడు లేదా రిహార్సల్స్ కోసం ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఉండటం సర్వసాధారణం. కానీ సినిమాలో మీరు చూసిన ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో నేను స్వయంగా పాల్గొన్నాను.. నిజానికి అమ్మాయిలకు సినిమాల్లో యాక్షన్ సీన్స్ చేసే అవకాశం రావడం అరుదు. అందుకే ఇష్టమైన స్టంట్స్ చేయడానికి చాలా కష్టపడ్డా’ అని వీడియో ఆధారాలతో ఆమె ఇచ్చిన ఈ సమాధానంతో ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయి.
Also Read
- US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
- Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
- Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
- Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.
Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4
— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
-
US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
-
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్‌డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!