Malaria Outbreak: మన్యంలో మలేరియా.. ఆందోళన చెందుతున్న గిరిజనులు!
- మన్యం జిల్లా ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు
- జ్వరాలతో బాధపతున్న 25 మంది
- 10 మందికి మలేరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaria Scare in Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధిలోని తాడివలస, జీలకవలస గ్రామాల్లో ఇప్పటివరకు సుమారు 25 మంది వరకు జ్వరాలతో బాధపతున్నారు. వీరిలో 10 మందికి మలేరియాగా చెబుతున్నారు. జ్వరాలతో బాధపడుతున్న 15 మంది ప్రస్తుతం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 10 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.
జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వారం రోజుల క్రితం గురునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. అయినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల్లో కలుషిత నీరు, గెడ్డ నీటిని తాగడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో బోర్లు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సింగిల్ ఫేజ్‌గా ఉండటంతో మోటార్లు పనిచేయడం లేదు. దీంతో స్వచ్ఛమైన తాగునీటి కొరత ఏర్పడిందని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు వైద్య సేవలను మరింత విస్తరించాలని కోరుతున్నారు.
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!