జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో సూక్ష్మ కళాకారుడు గుండుపిన్నుతో చాక్ పీస్ పై 78 జాతీయ జెండాలను తయారుచేసి దేశభక్తిని చాటాడు. గిరిజన గురుకుల బాలుర కళాశాలకు చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు, సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ 78వ స్వాతంత్యం దినోత్సవాన్ని పురస్కరించుకుని 8 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటి మీటర్ వెడల్పు గల చాక్ పీస్ పై 4 మిల్లీ మీటర్ల ఎత్తు ఉన్న 78 ఔతీయ జెండాలను సుమారు 3 గంటల పాటు శ్రమించి గుండు పిన్ను సహాయంతో తయారుచేశాడు. అదేవిధంగా 78 చాక్పీస్ లతో 78 జాతీయ జెండాలను 2 సెంటీమీటర్ల ఎత్తు 8 మిల్లీ మీటర్ల వెడల్పు సుమారుగా 3 గంటల పాటు శ్రమించి ష్వాల్చ రింగ్ ఆర్ట్ ద్వారా చెక్కాడు.
Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పికి వీసా నిరాకరించిన అమెరికా..
3 బియ్యపు గింజలపై 3 మిల్లీమీటర్ల ఎత్తున్న భారత మువ్వన్నెల జెండాలను కూడా రూపొందించాడు. తన సూక్ష కళా ద్వారా భారత దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఇంతకు ముందు చాక్ పీస్ పై జాతీయ గీతం జనగనమన, జాతీయగేయం వందేమాతరం, స్వాతంత్ర సమర యోదులు భగత్ సింగ్, నెహ్రూ, గాంధీ, అంబెడ్కర్ వంటి ప్రముఖల శిల్పాలను సైతం చెక్కి దేశభక్తిని చాటాడు. బియ్యవు గింజలపై 278 అక్షరాల జాతీయగీతం, జాతీయగేయంను రాసి వివిధ ప్రపంచ రికార్డులను, అవార్డులను సొంతం చేసుకుని పలువురి ప్రశంసలు పొందాడు ఈ రజినికాంత్.
Nallari Kiran Kumar Reddy: ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది..