Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti Hijab Protests: ఈ ఏడాది సెప్టెంబరులో ఇరాన్లో పోలీసు కస్టడీలో ఉన్న 22 ఏళ్ల మహ్సా అమిని మరణించిన సంగతి తెలిసిందే. మహ్సా అమిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి అలీ బఖేరీ తన ప్రభుత్వాన్ని సమర్థించారు. మహ్సా అమిని చంపబడలేదు అని.. ఆమె మరణించిందని ఆయన ఇరాన్ సర్కారును సమర్థించుకున్నారు. ఇలా సమర్థించడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మహ్సా అమినీ చంపబడలేదు, ఆమె మరణించింది. ఇరాన్లో అభివృద్ధికి సంబంధించి కొన్ని పాశ్చాత్య మీడియాలు సృష్టించిన వాతావరణాన్ని చూశాము. ఇరాన్ దేశ హక్కులను ఈ పాశ్చాత్య శక్తులు ఉల్లంఘిస్తున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాశ్చాత్య శక్తులు ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా లేదా యెమెన్ ప్రజల గురించి మాట్లాడవు. ఆ శక్తులు ఆ దేశాల్లోని చర్యలను ఖండించరని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న పోలీసులు నిర్బంధించిన కుర్దిష్-ఇరానియన్ మహిళ మరణం తర్వాత ఇరాన్ ఇటీవలి చరిత్రలో అతిపెద్ద అసమ్మతిని ఎదుర్కొంటోంది.
Also Read
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..
ఇదిలా ఉండగా, ఇరాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. మంగళవారం యూఎన్ మానవ హక్కుల కార్యాలయం ఇరాన్లో గత వారంలో ఇద్దరు యువకులతో సహా 40 మందికి పైగా మరణించారు. అమిని మరణం తర్వాత శాంతియుత నిరసనల్లో చేరినందుకు ఇరాన్ అంతటా వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు మద్దతుగా అనేక మంది సెలబ్రిటీలు, క్రీడాకారులు ఆందోళనలు చేపట్టారు. యూఎన్ హక్కుల కార్యాలయం ప్రకారం, సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగినప్పటి నుంచి 40 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది భద్రతా దళ సిబ్బంది మరణించినట్లు ఇరాన్ అధికారులు నివేదించారు.
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!