Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabari River Flood: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పోలవరం జిల్లాలో శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. శబరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 28 అడుగులకు చేరుకుంది. శబరి నది ఉగ్రరూపంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు ముకునూరు ప్రాంతంలో సోకిలేరు వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి కల్వర్టు పూర్తిగా నీట మునగడంతో చింతూరు, వి.ఆర్.పురం మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రహదారి మార్గాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ఉద్యోగులు ప్రమాదాన్ని లెక్కచేయకుండా నీటితో మునిగిపోయిన కాజ్‌వేపై నడుచుకుంటూ విధులకు హాజరవుతున్నారు. వరద నీటిలో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
శబరి నది వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వాగులు, వంకలు, నీటితో మునిగిన రహదారులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!