Site icon NTV Telugu

Mahmood Ali : మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారు

Mahmood Ali

Mahmood Ali

దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గం, అసిఫ్‌నగర్ లోని నియోజకవర్గ ఇంఛార్జి సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశ వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బీఆర్‌ఎస్‌ స్టేట్ ఇంఛార్జి బండి రమేష్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

Also Read : Qamar Javed Bajwa: పాకిస్తాన్ ఆర్మీకి అంత సీన్ లేదు.. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అన్ని డివిజన్ల నుండి బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, తెలంగాణ వచ్చిన తర్వాత అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనలు పార్టీ మరింత బలోపేతానికి, కార్యకర్తల ఐక్యతకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Also Read : MP Ranjith Reddy : తెలంగాణలో రైతుని రాజు చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్

Exit mobile version