NTV Telugu Site icon

Mahmood Ali : పలువురు చనిపోయినట్టు అనుమానం.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతాం

Mahmood Ali

Mahmood Ali

హైదరాబాద్‌ లోని సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్‌ పేట్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్‌ నైట్‌ వేర్‌ స్టోర్‌ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో.. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఉన్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే.. మరో ఇద్దరు గురించి ఆచూకీ తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిందని, డెక్కన్ స్పోర్ట్స్ నైట్ వేర్ లో ప్రమాదం జరిగిందన్నారు. అందులో మొత్తం ప్లాస్టిక్ ఉందని, మంటలను అదుపు చేసేందుకు 6 గంటలుగా సిబ్బంది శ్రమిస్తున్నారన్నారు. పలువురు చనిపోయినట్టు అనుమానం ఉందని, ఇంకా పూర్తిగా క్లారిటీ లేదని ఆయన వెల్లడించారు.

Also Read : Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో

అయితే.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని, నిభందనలు ఉల్లంఘించి గోదాంలు నడిపితే కటిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. ఏ క్షణంలోనూ భవనానికి ముప్పు పొంచి ఉందని, భవనంలోని మూడు నాలుగు అంతస్తుల స్లాబ్‌లు కూలిపోయాయన్నారు. భవనం లోపల ఉన్న మెట్ల మార్గం కూడా కూలిపోయిందని, భవనం వెనుక వైపు గల మరొక భవనం స్లాబ్ సైత కూలిందని ఆయన తెలిపారు. సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయని, సెల్లార్‌లో ఉన్న స్పోర్ట్స్ టీ షర్ట్ సింథటిక్‌ క్లాత్‌ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కార్‌ యాక్సెసరీస్ ఫైబర్ పరికరాలలో భారీ మంటలు చెలరేగాయని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పరిసరాల భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా భవనం కూలితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read : Cm Jagan Mohan Reddy: ఉన్నత విద్యాశాఖపై సమీక్ష.. . ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ పై జగన్ ఫోకస్