Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్‌లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లతో అమ్మకాలలో రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO మార్కెట్‌లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని డిజైన్, ఫీచర్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు ఇంకా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఈ మోడల్ బాగా పాపులర్ అయ్యింది. ఇకపోతే, ఈ కారు గత డిసెంబర్ 2024లో మహీంద్రా 7,000 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. ఈ సంఖ్య 2023 డిసెంబర్ అమ్మకాలతో పోలిస్తే.. ఏకంగా 97 శాతం వృద్ధిని చూపిస్తుంది. అప్పట్లో ఈ ఎక్స్‌యూవీ కేవలం 3,550 యూనిట్లే అమ్ముడయ్యాయి. ఈ రికార్డుతో మహీంద్రా మరొకసారి మార్కెట్‌లో తన స్థాయిని నిరూపించుకుంది. ఈ కారును కొనాలంటే మూడు నెలల నుండి 14 నెలల సమయం బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ పడుతోంది.
Also Read: Jagjit Singh Dallewal: ‘‘అకల్ తఖ్త్‌ని కాదు, మోడీని కలవండి’’.. అప్పుడే నిరాహార దీక్ష విరమిస్తా..
ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఆకట్టుకునే డిజైన్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ DRLs, పెద్ద సెంట్రల్ ఎయిర్ టెక్, LED హెడ్‌లైట్స్, సవరించిన బంపర్ తో ప్రత్యేక ఆకర్షణగా కనపడుతోంది. వెనుక భాగంలో వెడల్పాటి LED లైట్ బార్, స్లీక్ సి ఆకారంలో టెయిల్ ల్యాంప్స్, అప్డేటెడ్ టెయిల్‌గేట్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇక ఈ ఎక్స్‌యూవీ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
* 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ – 108bhp పవర్, 200 nm టార్క్.
* 1.2-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ – 129bhp పవర్, 230 nm టార్క్.
* 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ – 115bhp పవర్, 300 nm టార్క్ లలో అందించబడుతుంది.
Also Read: Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం..
ఈ ఇంజిన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి. ఫ్యూయల్ ఎఫిషియన్సీలో కూడా ఇది ముందంజలో ఉంది. లీటర్‌కు 18.89 – 20.1 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. అంతేకాక ఈ ఎక్స్‌యూవీ ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తోపాటు.. హర్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్స్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఎస్‌యూవీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ, 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ అండ్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.