Ramdev Baba: రాందేవ్ బాబా దిష్టిబొమ్మ దగ్ధం… మహిళా కాంగ్రెస్ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసనకు దిగింది. రాందేవ్ బాబా దిష్టి బొమ్మ దగ్ధం చేసిన మహిళా కాంగ్రెస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మాజీ మంత్రి గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. రాందేవ్ బాబా వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మాట వేరే పార్టీ వాళ్ళు అన్ని వుంటే ఇప్పటికీ బత్తాయిలు , హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి ని అన్ని రచ్చ చేసేవారని అంటున్నారు.
పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని, నా కళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని బాబా రాందేవ్ నోరు జారారు. యోగా క్లాసుకు వస్తున్న మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాబా రాందేవ్ మాటలపై రచ్చ రేగుతోంది.మహిళా సంఘాలు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పాలంటున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

గతంలోనూ రాందేవ్ బాబా వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. కరోనా రెండో వేవ్ సమయంలో బాబా రాందేవ్ అల్లోపతి వైద్య విధానాలపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “అల్లోపతి మందుల వల్ల లక్షల మంది మరణించారు. వారికి చికిత్స లేదా ఆక్సిజన్ అందక మరణించిన వారి కంటే చాలా ఎక్కువ. అల్లోపతి మూర్ఖమైన, దివాళా తీసిన శాస్త్రం” అని కూడా యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది వైద్యులు మరణించారని ఆయన పేర్కొన్నారు.
Read ALso:Team India: టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ దొరికేశాడా?
ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు గతంలోనూ అసహనం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?