Site icon NTV Telugu

Mahesh Kumar Goud : కేటీఆర్ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే.. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు. చొప్పదండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో లోకల్ బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా కేటీఆర్‌కి విషెస్ చెప్పించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా కార్యక్రమాలను నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read : Drugs Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్

పిల్లలతో చేయించిన యాక్టివిటీస్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్‌ బర్త్‌డేకు విద్యార్థులను ఉపయోగించడమేంటి? అని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్చార్సీలో కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, దర్పల్లి రాజశేఖర్, తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో చిన్న పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ వారిని కేటీఆర్ అనే పదం వచ్చే విధంగా కూర్చోబెట్టారని, దీనిపై మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. కేటీఆర్ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పుట్టిన రోజు పేరుతో హంగు, ఆర్భాటాలు చేశారని, కేటీఆర్ పైన స్థానిక ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమీషన్ ను కోరామన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌.

Also Read : Rashmi: రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన ఆటో రాంప్రసాద్.. ?

Exit mobile version