NTV Telugu Site icon

Mahesh Kumar Goud : ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ గ్రూప్ -1 అభ్యర్థులను రెచ్చగొట్టింది

Bomma Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud

నుడా చైర్మన్ అభినందన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయం సువర్ణ మయం కాబోతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏం చేశారని కేంద్ర మంత్రులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉనికి కోసం బి.అర్.ఎస్. గ్రూప్ _1 అభ్యర్థులను రెచ్చగొట్టిందన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ . కేటీఅర్, హరీష్ రావు రోడ్లు ఎక్కి తమాషాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం.. బుద్గాం స్థానాన్ని వదులుకున్న సీఎం

ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలు అయ్యాక పార్టీలకు అతీతంగా జరిగే అభివృద్ధి కి ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. దేశంలోనే మంచి క్యాబినెట్ తెలంగాణ లో ఉందని, నిత్యం ప్రజల్లో ఉండే నేతలే మంత్రులుగా ఉన్నారన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. నామినేటెడ్ పదవుల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యమని, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను కాపాడుకుంటాం, న్యాయం చేస్తామన్నారు. జిల్లాకు త్వరలో మరో మెడికల్ కళాశాల మంజూరు కానున్నట్లు ఆయన తెలిపారు. 120 కోట్ల తో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కళాశాల జిల్లాకు మంజూరు అయిందని, సీఎం కు విద్యా, వైద్యం, క్రీడల పై మక్కువ ఉందని, ఆ రంగాలను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తామన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌.

 Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధిలో అపచారం.. మద్యం తాగి చిందులు

Show comments