NTV Telugu Site icon

Mahesh Kumar Goud : మజ్లిస్‌తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు.. తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్

Bomma Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud

మజ్లిస్‌తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు అని, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త, పాత అంత కలుపుకుని పోతున్నామని ఆయన తెలిపారు. ఏ అంశంలో అయిన ముందు నుండి ఉన్న కాంగ్రెస్ నాయకులకీ ముందు ప్రియారిటీ ఉంటదన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. వాయినాడ్ లాంటి పరిస్థితి మనకు రాకూడదనే.. అనుకోని సంఘటన జరిగితే….ఎవ్వరు ఇబ్బంది పడొద్దనే మూసీ నిర్ణయమన్నారు. మేము మా ప్రభుత్వం మూపీ ప్రక్షాళనకి డీపీఆర్ ఇవ్వలేదన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందంతోనే వాళ్లకి లాభాలు జరుగుతున్నాయన్నారు. సిసోడియాకి రాని బెయిల్… కవితకి ఎలా వచ్చింది… అందరికి తెలుసు అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఎవ్వరిని కించపరచాలని ఉద్దేశంతో కొండా సురేఖ మాట్లాడలేదని, ఎంత కడుపు మంట.. బాధ ఉంటే అలా మాట్లాడుతది అని ఆయన అన్నారు.

Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..

అంతేకాకుండా..’కేటీఆర్ ఆమెని అవమానించేలా మాట్లాడితే… మాట్లాడింది.. వ్యక్తి గతంగా ఏం లేదు అని, కొండా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పాను. వెంటనే.. ఉపసంహరించుకున్నారు. మూసీకి లక్షా యాభై కోట్లు అని ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్పలేదు. భవిషత్తు తరాలకు హైదరాబాద్ తీర్చి దిద్దాలా వద్దా బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు కేబినెట్ కు ఎలాంటి సంబంధం లేదు, హైడ్రా టార్గెట్ పేద ప్రజలు కాదు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన బడా బాబులే టార్గెట్. బీజేపీ బీద ప్రజల విషయంలో మాట్లాడే హక్కు లేదు, బీద ప్రజలకు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో త్వరలో ఇంకొన్ని చేరికలు ఉంటాయి. ఇప్పటికే కొంత మంది బిఅరెస్ నుండి కాంగ్రెస్ లో చేరిన వారు ఉన్నారు. పూర్తి స్థాయిలో జిల్లా పర్యటన తర్వాతే పీసీసి కమిటీలు. 15వ తేదీ రెండు జిల్లాలు,16వ తేదీ రెండు జిల్లాలు పర్యటన చేస్తా. ఎంఐఎంకు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పొత్తు లేదు. కేవలం స్నేహపూర్వక ఒప్పందం మాత్రమే. లా&ఆర్డర్ విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.

Viral Video: “అది కొండచిలువ.. బల్లిని కాదు గురూ..” బాల్కనీలో పాము కోసం వెతుకుతూ..

Show comments