నస్పూర్ లో ఈనెల 11 న కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, పాదయాత్రలకు జనం నుంచి భారీగా స్పందన ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగా కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదని, బీఆర్ఎస్ ను గద్దె దించే పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీల పగటి వేషాలు జనం గమనిస్తున్నారని, పేపర్ లీకేజీ కేసీఆర్ కుటుంబంలో ధనాగారంగా మారిందని ఆయన ఆరోపించారు. లీక్ చేసుకోవడం అమ్ముకోవడం.. టెన్త్ పేపర్ లీకేజీ లో ఎందు కంతా హడావుడిగా బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఎందుకంత హైడ్రామా అని ఆయన అన్నారు. బీజేపీ ప్రభావం ఉందని తెలపడం కోసం బండి సంజయ్ అరెస్ట్ చేశారన్నారు.
Also Read : Koppula Eshwar : కేసీఆర్‌ను జైలుకు పంపుతా అన్న బండి సంజయ్‌నే జైల్లోకి పోయి కూర్చుండు
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోతుందని, కాంగ్రెస్ ను ఆపాలంటే బీజేపీని పెంచాలని, ఆ లోపాయికారి ఒప్పందంలో భాగమే ఈ డ్రామా అంతా అని ఆయన ధ్వజమెత్తారు. ఇదే కాకుండా.. కవిత ఎపిసోడ్ పై మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ ఉండదని, ఇదొక హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు. రెండు చార్జీ షీట్ల పేరు ఉంటే మూడో చార్జీ షీట్లో పేరు ఎట్లా మాయం అయిందన్నారు. అమిత్ షా, కేసీఆర్ మాట్లాడుకున్న నాటకంలో భాగంగానే కవిత ఎపిసోడ్ జరిగిందన్నారు. కేసీఆర్, అమిత్ షా నడిపించారన్నారు. రాష్ట్రంలో నయిం ఇష్యూలో ఏంచూపించారు.. డ్రగ్స్ కేసు ఏమైంది.. సిట్ అధికారి బదిలీ అయింది. ఆకేసు అటకెక్కింది. ఒక్క ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయి..నమ్మితే మోసపోతామని ఆయన అన్నారు.
Also Read : Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?