Varanasi : మహేశ్ – రాజమౌళి ఫైట్‌.. రేయ్ దారుణం రా ఇది?

Mahesh Rajamouli

Mahesh Rajamouli

ఈరోజుల్లో ఏఐ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వారుండరు. ఉంటే మాత్రం.. నిజంగానే మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకున్నారా? ఇద్దరి మధ్య ఇంత పెద్ద ఫైట్ జరిగిందా? అని అనిపించకమానదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. ఏది ఒరిజినలో? ఏది ఏఐ క్రియేటేడో? తెలియకుండా పోతోంది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు రూపొందించిన ఒక ఏఐ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలు విలన్లతో పోరాడటం చూస్తుంటాం. కానీ, ఈ ఏఐ వీడియోలో స్వయంగా రాజమౌళి, మహేశ్‌ బాబు యాక్షన్ సీక్వెన్స్‌లో తలపడటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వీడియోను చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “సినిమా ఈజ్ డెడ్” అంటూ వీడియోను షేర్ చేశారు. భవిష్యత్తులో నటులు, భారీ సెట్లు, కెమెరాల అవసరం లేకుండానే కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని ఏఐతో అద్భుతమైన సినిమాలు తీసేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ సినిమా మేకింగ్‌కు ఇది ముగింపు పలుకుతుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో ‘వారణాసి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. కానీ ఈలోపు.. ఇలాంటి ఏఐ దారుణాలు ఇంకెన్ని చూడాలో ఏమో!