దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ మైక్ పట్టినా, ఫ్యాన్స్‌కు కచ్చితంగా ఏదో ఒక క్రేజీ అప్‌డేట్ దొరకడం పక్కా. తాజాగా ఆయన ఓ చిన్న సినిమా ఫంక్షన్‌లో పాల్గొని, ఏకంగా ఓ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా ఆయన ఇచ్చిన ఈ బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ (Dad’s Little Friend) సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతున్న సమయంలో.. “సార్, మాకోసం వారణాసి (Varanasi) మూవీ అప్‌డేట్ ఏదైనా చిన్నది ఇస్తారా?” అని అక్కడున్న వారు అడిగారు. దానికి విజయేంద్ర ప్రసాద్ ఏమాత్రం ఆలోచించకుండా ఆల్రెడీ చెప్పేసాంగా ఏప్రిల్ 7వ తేదీ 2027 అని అన్నారు.
“ఏప్రిల్ 7వ తేదీన కచ్చితంగా రిలీజ్ అవుతుంది” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆశ్చర్యపోయిన యాంకర్.. ‘సార్ ఆ డేట్ కన్ఫర్మా?’ అని మళ్లీ అడగ్గా.. “కన్ఫర్మ్.. కన్ఫర్మ్” అని ఆయన అన్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్, జక్కన్న కలయికలో వస్తున్న తొలి సినిమా కావడం ఒక విశేషమైతే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటివరకు వారణాసి నుంచి కొన్ని స్టిల్స్‌తో పాటు ఓ గ్లింప్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో సినిమా కథ, ఇతర కీలక అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

