తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. లెక్క ప్రకారమే వస్తాయి.. కలెక్షన్స్ ను కొల్లగొడతాయి.. సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు సినిమాలన్ని మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి…. ఇప్పుడు తాజాగా గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి రేసులో దిగబోతున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని తెలుస్తోంది. అయితే కేవలం ఈ సంక్రాంతికి మాత్రమే కాకుండా మహేష్ బాబు గతంలో ఎన్నో సంక్రాంతి పండుగలకు సినిమాలను విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.. సంక్రాంతి బరిలో ఇప్పటివరకు ఎన్నిసార్లు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
మహేష్ బాబు కౌబాయ్ గెటప్ లో కనిపించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ.. ఈ సినిమా 2002లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ గా నిలిచింది..
ఇక 2003 లో ఒక్కడు సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు మహేష్ బాబు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మూవీగా నిలిచిపోయింది..
ఒక్కడు తర్వాత చాలా కాలంలో గ్యాప్ తీసుకున్న మహేష్ 2012లో బిజినెస్ మ్యాన్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.. సంక్రాంతి మూవీగా విడుదలైంది..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఆ తర్వాత 2013లో మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సూపర్ హిట్ అటాక్ ని అందుకున్నారు మహేష్ బాబు..2014 1 నేనొక్కడినే మూవీతోనే. భారీ అంచనాలతో రిలీజైన్ ఈ చిత్రం ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది..
సరిలేరు నీకెవ్వరూ.. 2020లో సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ విధంగా మహేష్ బాబు తన కెరీర్ లో మొత్తం ఆరుసార్లు సంక్రాంతి బరిలో పోటీ చేయగా నాలుగు సార్లు విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..