NTV Telugu Site icon

M.S. Dhoni: మెజిషియన్ కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురైన మహేంద్ర సింగ్ ధోనీ.. వీడియో వైరల్

Ms Dhoni

Ms Dhoni

M.S. Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఓ మెజిషియన్తో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఆ మెజిషియన్ ధోనీని కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియోలో ఉన్న మెజిషియన్ పేరు నమన్ ఆనంద్. అతనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశాడు.

Read Also: World Cup 2023 Final: చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్

ఈ వీడియోలో.. మెజిషియన్ మహేంద్ర సింగ్ ధోనిని చేతిలో కార్డు తీసుకోమని కోరాడు. ఆ తర్వాత ధోనిని మెజిషిన్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. మీకు నా ఫేవరెట్ కార్డ్ తెలుసా? ఈ విషయం నేనెప్పుడైనా చెప్పానా అంటూ అడిగాడు. దీనికి మహేంద్ర సింగ్ ధోనీ స్పందిస్తూ నో, నువ్వు నాకు చెప్పలేదు. అప్పుడు మెజిషియన్ ఆనంద్.. ఎవరికీ తనకు ఇష్టమైన కార్డ్ తెలియదని.. చివరికి అది కార్డ్ నంబర్ 9 అని చెబుతాడు. అయితే.. మహేంద్ర సింగ్ ధోనీ నమన్ ఆనంద్ తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ వీడియోలో ధోని స్టైల్‌ని చూసి అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

Read Also: Jaya Prada: జయప్రదపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన యూపీ కోర్ట్..