NTV Telugu Site icon

మహాయుతిలో సీట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్.. బీజేపీకి 28, శివసేన-ఎన్‌సీపీకి..?

Maharastra

Maharastra

మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన ( షిండే వర్గం) ఎన్సీపీ( అజిత్ వర్గం ) పార్టీల మధ్య తీవ్ర కసరత్తు చేసిన తర్వాత ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకానికి ఒప్పందం కుదురింది. ఈ ఒప్పందం ప్రకారం 48 సీట్లలో బీజేపీకి 28, శివసేనకు 15, ఎన్సీపీకి 4, రాష్ట్రీయ సమాజ్ పక్షానికి 1 సీటు దక్కింది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీలు, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ఆధారంగా మొత్తం 48 స్థానాలకు గాను 45 స్థానాలు గెలవాలని మహాయుతి కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ తదుపరి మూడు దశల ఎన్నికలలో మరిన్ని ర్యాలీల్లో ప్రసంగిస్తారని ఎన్డీయే కూటమి నేతలు భావిస్తున్నారు.

Read Also: Interview Tips : ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

కాగా, ముంబై నార్త్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, నాగ్‌పూర్, చంద్రాపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, అకోలా, అమరావతి, వార్ధా, నాందేడ్, లాతూర్, షోలాపూర్, మాధా, సతారా, రత్నగిరి వంటి 28 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా.. కాగా, సింధుదుర్గ్, నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, పూణే, సాంగ్లీ, అహ్మద్‌నగర్, బీడ్, ధులే, దిండోరి, భివాండిలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ పాల్ఘర్ క్యాండిడెట్ ను ఇవాళ ప్రకటిస్తామని తెలిపింది.

Read Also: Heat wave Warning: తెలంగాణకు హీట్‌వేవ్ వార్నింగ్.. 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్

ఇక, శివసేన ( షిండే వర్గం ) ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై సౌత్ సెంట్రల్, థానే, నాసిక్, కళ్యాణ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే, హింగోలి, యవత్మాల్-వాషిమ్, షిర్డీ, రామ్‌టెక్, బుల్దానా, మావల్ మరియు ఔరంగాబాద్‌ల నుంచి పోటీ చేస్తోంది. ఎన్సీపీకి బారామతి, రాయ్‌గఢ్, ధారశివ్, షిరూర్ దక్కగా, రాష్ట్రీయ సమాజ్ పార్టీకి పర్భానీ సీటును కేటాయించింది.