చదువు అయ్యాక ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు.. అందులో భాగంగానే చదివిన చదువు తగ్గట్లు ఉన్న సంస్థలకు ఇంటర్వ్యూ లకు వెళ్తారు.. అయితే ఇంటర్వ్యూలకు వెళ్లిన మొదటిదే సక్సెస్ అవ్వాలంటే కష్టం.. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం చాలా సులువు అంటున్నారు నిపుణులు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఇంటర్వ్యూకు వెళ్తున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి బాగా తెలుసుకొని వెళ్ళాలి.. అలాగే డ్రెస్సింగ్ కూడా ఫార్మల్ గానే ఉండాలి.. డీసెంట్ లుక్ లో కనిపించాలి.. అప్పుడే ఇంప్రెస్సిన్ వస్తుంది..
ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. గేట్ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి.. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా.. సంస్థలో ఎంతో మంది ఎదురవుతారు.. అంటే అన్నీ తెలుసు అనే కాన్ఫిడెంట్ ఉండటం మంచిది. ఏ విషయానికి కూడా భయపడకూడదు.. ఇంటర్వ్యూలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి.. ఏదోకటి మాత్రం అస్సలు చెప్పొద్దు..
అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్లు ముందు ఉంటే తల దించుకోవడం, కాలు కధపడం, దిక్కులు చూడటం అస్సలు చెయ్యకూడదు.. ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు జాబ్ అప్లికేషన్‌తోపాటు రెజ్యూమ్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్‌లో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు.. మనం సెలెక్ట్ అయిన లేకున్నా చివర్లో ధన్యవాదాలు చెప్పడం మర్చిపోవద్దు..