Medha Gandhi: నేడు మహాత్మా గాంధీ పుట్టిన రోజు. భారతజాతి ముద్దుగా బాపు అని పిలుచుకునే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సాంప్రదాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి అసత్యమాడటం గాంధీకి గిట్టని పనిగా చెబుతుంటారు. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా పోర్‌బందర్‌లోను, రాజ్‌కోట్‌లోనూ కొనసాగింది. గాంధీజీకి 13 ఏళ్ల వయస్సులో అప్పటి ఆచారము…