Manoj Sinha: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదు.. జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Lieutenant Governor Manoj Sinha: బాపూజీ మహాత్మాగాంధీపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం గ్వాలియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా అన్నారు. “చాలా మంది గాంధీజీకి న్యాయశాస్త్రంలో పట్టా ఉందనే అపోహ పడుతుంటారు, కానీ ఇక్కడ నేను చెబుతున్నాను, ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. గాంధీజీకి హైస్కూల్ డిప్లొమా మాత్రమే ఉంది.” అని మనోజ్ సిన్హా అన్నారు. మనోజ్ సిన్హా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ.. నిరక్షరాస్యులను గవర్నర్లుగా చేస్తే ఫలితం ఉంటుందని అన్నారు.
Read Also: Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
గురువారం ఐటీఎం యూనివర్సిటీలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్మారకార్థం, ఛాన్సలర్ రామశంకర్ సింగ్ సంపాదకత్వం వహించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరయ్యారు. ఇక్కడ పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం సిన్హా తొలుత మహాత్మా గాంధీపై మాట్లాడారు. గాంధీజీ కేవలం హైస్కూల్ డిప్లొమా మాత్రమే చేశారన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు నన్ను ప్రశ్నిస్తారు, కాబట్టి నేను పూర్తి వాస్తవాలతో చెబుతున్నాను, దీనికి తన దగ్గర ఆధారం ఉందన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ప్రకటనపై మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. నిరక్షరాస్యులను గవర్నర్లుగా చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. ఆయన లా డిగ్రీని కలిగి ఉన్నారన్నారు. మోడీ జీ లాగా పొలిటికల్ సైన్స్‌లో పూర్తి స్థాయి లా డిగ్రీని కలిగి ఉన్నారు. డిగ్రీ నుంచి తన జీవితం వరకు అన్నీ బాపు తన ఆత్మకథలో రాసుకున్నారని అన్నారు. నేను దీని కాపీని మనోజ్ సిన్హాకి పంపుతాను, తద్వారా అతను తన అవగాహన పెంచుకుంటారన్నారు.
Modi’s representative in Kashmir says Mahatma Gandhi had no academic degree. These guys to justify Modi’s fake degrees can even insult Mahatma. Gandhi had a law degree from University College London. pic.twitter.com/kbkmATCBOP
— Ashok Swain (@ashoswai) March 24, 2023
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!