NTV Telugu Site icon

Thirumala: తిరుమల ఘాట్ రోడ్డులో మహాశాంతి హోమం.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు..!

Homam

Homam

Thirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టీటీడీ మహాశాంతి హోమం జరిపించింది. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ చనిపోలేదు కానీ.. వాహనాలు పాడైపోయాయి. అంతేకాకుండా భక్తులు గాయాలపాలయ్యారు. అయితే ఆ వెంకటేశ్వరస్వామి చల్లని చూపు వల్లనే భక్తులకు ఎలాంటి ఆపద జరగడం లేదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అయితే ఈ హోమం ద్వారా ఎలాంటి ప్రమాదాలు, ఆపదలు కలుగుకుండా నివారణ చేయొచ్చని.. అందుకే మహాశాంతి హోమం జరిపించినట్లు ఈవో తెలిపారు.

Read Also: Prabhas Dubbing: ప్రభాస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ విలన్.. ఎవరో తెలుసా?

బుధవారం డౌన్‌ ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మహా శాంతి హోమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు. ఘాట్‌ రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో పాటుగా.. మరికొన్ని ప్రమాదాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు ఈవో చెప్పారు. అదే సమయంలో, భక్తుల భద్రత కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారన్నారు. అందుకోసమని ఘాట్ రోడ్లలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహా శాంతి హోమం నిర్వహించిన్నట్లు ఈవో తెలిపారు.

Read Also: Adipurush Collections: ఆదిపురుష్‌.. ఓపెనింగ్స్‌తో ఆలిండియా రికార్డుల బద్దలు?

ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు కలిగినప్పుడు మహాశాంతి హోమం నిర్వహించాలని తెలిపారు. ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చని వారు వివరించారు. ఉదయం 8 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది.