Site icon NTV Telugu

Assembly Sessions: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పటిష్ట భద్రత ఏర్పాటు

Nagpur

Nagpur

మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్‌లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి.

Smriti Irani: భారత్‌లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ

సమావేశాలకు ముందు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్, జాయింట్ కమిషనర్ అశ్వతీ దోర్జే సోమవారం పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధాన్ భవన్ చుట్టూ సాయుధ పోలీసులను వ్యూహాత్మకంగా మోహరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం.. 11,000 మంది పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) యొక్క 10 కంపెనీలు, 1,000 మంది హోంగార్డులు, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ ఫోర్స్ వన్, 40 బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు (BDDS) రాష్ట్ర శాసనసభ రక్షణగా ఉంటారు. అంతేకాకుండా.. 9 మంది డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు.

INDIA bloc: ఇండియా కూటమి మీటింగ్‌ తేదీ ఖరారు.. వెల్లడించిన లాలూ..

ఇదిలా ఉంటే.. తొమ్మిది మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ర్యాంక్ అధికారులు, ఇతర జిల్లాల నుండి 10 మంది అధికారులను నగరంలో మోహరించనున్నారు. ఈ క్రమంలో.. 50 మంది అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, 75 ఇన్స్పెక్టర్లు, 20 మంది మహిళా ఇన్స్పెక్టర్లను నాగ్‌పూర్‌కు పిలిపించారు. కాగా.. వీఐపీల భద్రత కోసం పోలీసులతో పాటు జిల్లాల నుంచి 30 బాంబ్ స్క్వాడ్‌లు, 10 మంది నగర పోలీసు బలగాలను బందోబస్తులో భాగంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే.. నాగ్ పూర్ లో మోర్చా నిర్వహించేందుకు 32 సంస్థలకు అనుమతి లభించిందని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 100 దాటుతుందని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇంత భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Exit mobile version