Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ మైలురాయిగా నిలిచిన ‘మహారాజా’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించి, గత ఐదేళ్లలో వచ్చిన అత్యుత్తమ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఈ సెన్సేషనల్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.
Also Read : RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు
Also Read
దర్శకుడు నిథిలన్ సామినాథన్ ఇప్పటికే ‘మహారాజా 2’ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసాడట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, దర్శకుడు చెప్పిన లైన్ తనకు బాగా నచ్చిందని, త్వరలోనే పూర్తిస్థాయి కథను వినడానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మొదటి భాగం సృష్టించిన సస్పెన్స్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంతో, రెండో భాగంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదటి భాగం తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం భారత్‌లోనే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ఈ సీక్వెల్‌లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటుందని, కథనంలో మరిన్ని ట్విస్టులు ఉండబోతున్నాయని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర నటీనటులు మరియు షూటింగ్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవల వరుస ప్లాపులు ఇస్తున్న విజయ సేతుపతి ఇప్పుడు మహారాజ 2 తో మరొక బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
తాజావార్తలు
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!