Keerthi Suresh : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ హీరోగా వచ్చిన “నేను శైలజ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తెలుగులో ఈ భామ నటించిన “మహానటి”సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా నటిగా కీర్తికి మంచి పేరు తెచ్చి పెట్టింది.ఈ సినిమాతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారింది.అయితే కెరీర్ ప్రారంభం నుండి స్కిన్ షో కు దూరంగా వుంటూ ట్రెడిషనల్ లుక్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ వస్తున్న కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘సర్కారువారి పాట’ మూవీ నుంచి రూట్ మార్చింది.
స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అన్ని పాత్రలు చేయాలనీ గ్రహించి ప్రస్తుతం ఆవిధంగా దూసుకెళ్తుంది.తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ మూవీలో నటిస్తుంది.ఖలీస్ దర్శకత్వంలో ‘బేబీ జాన్’ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ ఉంటుందని సమాచారం.ఆ సీన్ కథకు చాల ఇంపార్టెంట్ కావడంతో ఆ సీన్ నటించేందుకు అభ్యంతరం చెప్పని హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఆ ఆఫర్ కీర్తికి దక్కిందట.అయితే ఆ సీన్ కి కీర్తి ఓకే చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.