Site icon NTV Telugu

Mahakumbh : 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. సాధువు వేషంలో ప్రత్యేక్షం..

Karnataka

Karnataka

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో ఈరోజు చివరి రోజు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా కారణంగా.. కుటుంబం నుంచి తప్పిపోయిన వాళ్లను సైతం కొంత మంది కలుసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని విజయపురానికి చెందిన రమేష్ చౌదరి. ఈయన 24 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా ద్వారా తన కుటుంబాన్ని తిరిగి కలిశాడు.

READ MORE: Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు

విజయపురలోని కొల్హారా తాలూకాలోని బలుటి గ్రామానికి చెందిన రమేష్ చౌదరి 2001లో తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ద్వారా కుటుంబీకుల చెంతకు చేరుకున్నాడు. 24 సంవత్సరాల క్రితం రమేష్ కనిపించకుండా పోయినపుడు.. అతని కోసం విస్తృతంగా వెతికారు. కానీ ఎలాంటి ఫలితం లభించలేదు. తాజాగా బలుటి గ్రామానికి చెందిన మల్లనగౌడ పాటిల్, ఇతరులు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాకు వెళ్లారు. పుణ్యస్నానాలు పూర్తి చేసుకుని.. కాశీకి బయలుదేరారు. అక్కడ వారికి రమేష్ కనిపించాడు. కాశీలో ఒక సాధువు వేషంలో రమేష్‌ను దర్శనమిచ్చాడు. కుటుంబీకులతో వీడియో కాల్‌లో మాట్లాడి.. బలుటి గ్రామానికి తిరిగి తీసుకెళ్లాడు.

READ MORE: Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్‌పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. “నేను ఇంటి నుంచి తప్పిపోయి అనేక నగరాలు తిరిగాను. తరువాత నేను బీహార్‌లోని పాట్నా చేరుకున్నాను. అక్కడ తారు రోడ్డు వేసే పనులు చేశాను. నా ఇళ్ల నాకు చాలా గుర్తుకు వచ్చింది. నేను రెండు సార్లు ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ విరమించుకున్నాను. ఇక్కడికి వచ్చిన మల్లన గౌడ నా కొడుకు, తల్లిదండ్రులు, కుటుంబం గురించి చెప్పాడు. ఇప్పుడు నేను నా కుటుంబం వద్దకు వెళ్లాలను కుంటున్నాను.” అని తెలిపాడు.

 

Exit mobile version