Swarna Sudhakar Reddy: మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇవాల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీచంద్ రెడ్డి కూడా స్వర్ణ సుధాకర్ రెడ్డి వెంటే ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. ఈ క్రమంలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలను కూడా తనవైపు తిప్పుకోనుంది.
Read also: South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష తప్పదు
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి అమరచింత నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భూత్పూర్ నుంచి స్వర్ణ సుధాకర్ రెడ్డి జెడ్పీటీసీగా గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా స్వర్ణ సుధాకర్ రెడ్డికి బీఆర్ ఎస్ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
Read also: Komatireddy Venkat Reddy: ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది..
మరోవైపు మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ స్వర్ణమ్మ కాంగ్రెస్ లో చేరికపై జడ్పీటిసి ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్వర్ణమ్మ ది అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు. జెడ్పీ టిసి ల త్యాగ ఫలితమే ఆమె ఛైర్మన్ పదవి అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో లబ్ది పొంది కాంగ్రెస్ కోవర్ట్ గా వ్యవహరించారని జెడ్పీటీసీ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: పంట నష్టంతో అప్పులు తీరే పరిస్థితి లేదు.. బండి సంజయ్ తో రైతులు