NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా? ఈ సారి భక్తులకు కొత్త సౌకర్యాలు

Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025

మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.

ఈసారి క్యూఆర్‌ టికెట్‌ సౌకర్యం ..
ఈ సారి రైల్వేశాఖ భక్తులకు పెద్ద కానుక అందించింది . ప్రయాగ్‌రాజ్‌లో టిక్కెట్ బుకింగ్ కోసం ఇప్పుడు భక్తులు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ ఆప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాగ్‌రాజ్‌లో రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ యాప్ డెమో ఇచ్చారు. ఈ యాప్ ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మహాకుంభానికి సంబంధించి 50 నగరాల నుంచి రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు మార్గం ద్వారా ప్రతిరోజూ 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ కుంభమేళకు చేరుకుంటారని అంచనా.

‘పింక్ వెహికల్’ సౌకర్యం..
ఈసారి ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో భక్తులు, పర్యాటకులకే ఈ-రిక్షా, ఈ-ఆటో సౌకర్యం లభిస్తుంది. మహిళా భక్తులు, పర్యాటకుల కోసం ‘పింక్ వెహికల్’ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఓలా, ఉబర్ తరహాలో యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి, ఈ ప్రదేశాన్ని కాలుష్య రహితంగా ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇ-ఆటోలు, ఇ-రిక్షాలను నడపాలని నిర్ణయించారు. అంతేకాకుండా వారి డ్రైవర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.

వాయిస్ ఛేంజర్ ఫీచర్..
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యటకుల కోసం వాయిస్ ఛేంజర్‌ను తీసుకొచ్చారు. ఎవరైనా ఈ ఆసుపత్రిలో చేరినట్లయితే, వారి భాషను అర్థం చేసుకోవడానికి భాషను, వారు చెప్పేది హిందీ, ఇంగ్లీష్ లోకి మార్చే వాయిస్ ఛేంజర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది డాక్టర్‌కు సులభంగా అర్థం చేసుకోవడానికి, వారికి చికిత్స చేయడంలో సహాయం చేస్తుంది.
ఈ ఆస్పత్రిలో చిన్న, పెద్ద ఆపరేషన్లు కూడా చేయగలుగుతారు. గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు.