Asha Bhosle: ఆశా భోంస్లేతో తనకున్న అనుబంధంపై..మాస్ట్రో ఇళయరాజా ఎమోషనల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సంగీత సామ్రాజ్ఞి ఆశా భోంస్లే మరణం పట్ల సంగీత జ్ఞాని ఇళయరాజా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేవలం ఒక గాయనిగా మాత్రమే కాకుండా, తనపై ఒక తోబుట్టువులా ప్రేమను చూపించిన ‘ప్రియమైన సోదరి’ని కోల్పోయానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
Also Read: NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
Also Read
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
‘ఈరోజు ఆశా భోంస్లే గారు మనల్ని విడిచి వెళ్లారనే వార్త నన్ను తీవ్ర విచారానికి గురిచేసింది. ఇది కేవలం ఒక అధికారిక సంతాప సందేశం కాదు.. ఆమెకు నాపై ఎంతో ప్రేమ, మమకారం ఉండేవి. ఎప్పుడు చెన్నైకి వచ్చినా, టీవీ ఇంటర్వ్యూలు లేదా ఇతర పనులపై వచ్చినా సరే.. నన్ను కలవకుండా ఆమె తిరిగి వెళ్లేవారు కాదు. ఒక సంగీత దర్శకుడిగా నా పట్ల ఆమె చూపిన గౌరవం, ఆప్యాయత ఎప్పటికీ నా గుండెల్లో భద్రంగా ఉంటాయి’ అని ఇళయరాజా గుర్తుచేసుకున్నారు. ఆమె గాత్రం గురించి ప్రస్తావిస్తూ..
‘ఆమెది ఒక విలక్షణమైన స్వరం. ఏ ఇతర గాత్రాలతోనూ ఆశా భోంస్లేను పోల్చలేం. ఆమె ప్రతిభ అంతులేనిది, విశిష్టమైనది. ఆమె స్వరం ఈ చిత్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ దేవుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించాలని, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను’ అంటూ ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు దక్షిణ భారతీయ సంగీతంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
— Ilaiyaraaja (@ilaiyaraaja) April 12, 2026
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!