మహిళల దాడులు రోజూ రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాల ను తీసుకొని వస్తున్నా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కదులుతున్న రైళ్లో మహిళ పై అత్యాచారం చెయ్యడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించగా ఆమె ప్రతి ఘటించడంతో ఆ దుర్మార్గులు రైళ్లో నుంచి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దారుణం చోటుచేసుకుంది. కదులుతోన్న రైల్లో ఓ మహిళ పై ఐదుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటమే గాకుండా.. ఆమె బంధువు ను బలవంతంగా బయటకు తోసేశారు. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన వారిద్దరిని స్థానిక గ్రామస్థులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ మహిళ తన బంధువుతో కలిసి జార్ఖండ్ నుంచి గుజరాత్ వెళ్లేందుకు సూరత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఈ రైలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో కి చేరగానే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వేధించారు. అనుమతి లేకుండా ఫొటోలు తీశారు. దానికి ఆమె అభ్యంతరం తెలపడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారు ఆమె బంధువుపై దాడి చేశారు..
ఇక వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.. అయిన వదల్లేదు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాధితురాలిని, ఆమె బంధువునూ కదులుతోన్న రైల్లోంచే కిందికి తోసేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన వారు.. రాత్రంతా పట్టాల పక్కనే అపస్మారక స్థితిలో ఉండిపోయారు.. ఉదయం అటుగా వచ్చిన గ్రామస్థులు చూసి ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో జనాలు భయపడుతున్నారు.. ప్రభుత్వం ఇలాంటి వాటి పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు..