Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ban on Child Birth: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని సంకశ్యామ్ అనే గ్రామంలో గత 400 ఏళ్లుగా మహిళలు ఎలాంటి ప్రసవానికి నోచుకోలేదు!. గ్రామంలోని మహిళలు గ్రామ పొలిమేరలను దాటి బయటికి వెళ్లి పిల్లలకు జన్మనిస్తారు. గ్రామంలో జన్మనిస్తే, బిడ్డ వికృతంగా మారుతుంది లేదా తల్లి లేదా బిడ్డ చనిపోతారని గ్రామస్థులు భయపడుతున్నారు. సంకశ్యామ్ ఊరికి శాపం ఉందని.. అందుకే ఆ గ్రామస్థులు ఊరు బయటే ప్రసవిస్తారు. వర్షాకాలంలోనైనా సరే టేకు ఆకుల పందిరి కింద, భారీ వర్షాలకు ఊరి సరిహద్దు బయట ఉన్న మైదానంలో పిల్లలకు జన్మనిస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా అక్కడి గ్రామస్థులు పట్టించుకోరు.
మరోవైపు సాధారణంగా మనల్ని ఎవరైనా జన్మ స్థలం లేదా సొంత గ్రామం గురించి అడిగితే ఫలానా ఊరు అని చెప్పుకుంటాం. కొంత మంది మాత్రం పుట్టిన ఊరిలోనే స్థిరపడి ఉంటారు. కానీ రాజ్‌గఢ్ జిల్లా సంకశ్యామ్ గ్రామ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. వారు తమ ఊరి పేరు చెప్పుకోవడానికే భయపడతారు. ఇక్కడి గ్రామ ప్రజలు ఇప్పటికీ ఓ శాపానికి భయపడూతూ జీవిస్తున్నారు. అదేంటంటే..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
16వ శతాబ్దంలో గ్రామంలో దేవతలు ఆలయాన్ని నిర్మించేవారని ఈ గ్రామంలోని పెద్దలు పేర్కొంటున్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ సమీపంలో గోధుమలు రుబ్బుతుండగా.. ఆ శబ్ధం దేవతలకు భంగం కలిగించిందని.. దీంతో దేవుళ్లకు కోపం వచ్చి ఈ గ్రామంలో స్త్రీలకు పిల్లలు పుట్టరని శపించారని గ్రామస్థులు నమ్ముతున్నారు. అందుకే ఏ మహిళ కూడా గ్రామంలో పిల్లలను కనదు. “90 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతాయి, అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు ఊరి బయటే జరుగుతాయి. ఆలయ నిర్మాణానికి ఓ మహిళ ఆటంకం కలిగించిందని, అందుకే ఈ గ్రామానికి శాపం ఏర్పడిందని నమ్ముతారు. ” అని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్ తెలిపారు.
Father attack Son: ఆ..పని చేయలేదని కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
ఈ నమ్మకం చాలా ప్రముఖమైనది. ఏ స్త్రీ కూడా గ్రామ ప్రాంగణంలో ప్రసవానికి ప్రయత్నించదు. వాస్తవానికి, గ్రామస్తులు ఒక ప్రత్యేక గదిని నిర్మించారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఒక మహిళ అక్కడికి వెళ్లి ప్రసవించవచ్చు. భారతదేశంలోని ప్రజలలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. శతాబ్దాలుగా మూఢనమ్మకాలను ప్రజలు ఇంకా నమ్ముతున్నారనడానికి ఉది ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికీ ఆ ఊర్లో ఒక్క ఆస్పత్రి కూడా లేదంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతే కాకుండా బాలింతలకు లేదా పిల్లల తల్లులకు ఇచ్చే ప్రభుత్వ సహాకారాలు సైతం ఈ గ్రామస్థులకు అందదు. కొంత మంది గర్భిణిలు తమకు ఏడోనెల పడగానే వెంటనే ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!