Assembly Election 2023: ఓటేయాలంటే ఇవి ఉండాల్సిందే.. ఓటరు జాబితాలో మీ పేరు, పోలింగ్ కేంద్రం చెక్ చేస్కోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Election 2023: మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈరోజు (నవంబర్ 17) జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఓటింగ్‌పై ఇటు నాయకులు, అటు ప్రజలు చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఓటరు గుర్తింపు కార్డు, ఓటింగ్ స్లిప్ లేని కారణంగా ఓటు వేయడానికి చాలా మంది వెళ్లకపోవడం జరుగుతుంది. మీకు ఓటర్ ఐడీ లేకపోయినా, మీరు మీ ఓటు వేయవచ్చు. మీ ఓటు వేయడానికి, పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో మీ పేరు అవసరం. ఓటర్ ఐడీకి బదులు ఇతర గుర్తింపు కార్డులను పోలింగ్ కేంద్రంలో చూపించవచ్చు.
ఈ పత్రాలను చూపడం ద్వారా మీరు మీ ఓటు వేయవచ్చు
* డ్రైవింగ్ లైసెన్స్
* పాస్‌పోర్ట్
* ఆధార్ కార్డు
* పాన్ కార్డ్
* MNREGA జాబ్ కార్డ్
* NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
* స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్
* కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/PSU/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన ఫోటోతో కూడిన సేవా గుర్తింపు కార్డు
* ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం
* కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డులు
* MPలు/MLAలు/MLCలు మొదలైన వారు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు.
Also Read
- India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
- APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- MLA Adinarayana Reddy: రాజీనామాపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..
Read Also:Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి ధరలు.. వెండి ధర ఎంతంటే?
ఓటరు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి?
కింది దశలను అనుసరించడం ద్వారా మీరు ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు:
* https://electionsearch.eci.gov.inని సందర్శించండి
* మీ రాష్ట్రాన్ని నమోదు చేసి, ప్రాధాన్య భాషను ఎంచుకోండి
* పూర్తి వివరాలను – పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం
* మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోండి
* క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, శోధనపై క్లిక్ చేయండి
మీ పోలింగ్ బూత్‌ను ఎలా కనుగొనాలి?
మీరు క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి. మీ పోలింగ్ స్టేషన్‌ను కనుగొనవచ్చు.
* https://electionsearch.eci.gov.inని సందర్శించండి
* మీ పోలింగ్ స్టేషన్‌ని తనిఖీ చేయడానికి మీకు మూడు మార్గాలు ఉన్నాయి.
* మీ రాష్ట్రాన్ని నమోదు చేసి, ప్రాధాన్య భాషను ఎంచుకోండి
* పూర్తి వివరాలను – పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం
* మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోండి
* క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ పై క్లిక్ చేయండి
Read Also:Axis Bank : నిర్లక్ష్యం వహించిన యాక్సిస్ బ్యాంక్.. ఆర్బీఐ భారీ జరిమానా
EPIC/ఓటర్ ID కార్డ్ సహాయంతో ఇలా శోధించండి
* భాషను ఎంచుకోండి
* మీ EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను పూరించండి
* రాష్ట్రం ఎంచుకోండి
* క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ పై క్లిక్ చేయండి
మొబైల్ నుండి ఇలా వెతకండి
* రాష్ట్రం ఎంచుకోండి
* భాషను ఎంచుకోండి
* మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
* మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి
* క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ పై క్లిక్ చేయండి
తాజావార్తలు
-
India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
-
APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
-
KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
-
Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
-
Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!