Site icon NTV Telugu

Madhu Yaskhi : రేవంత్ వ్యాఖ్యలు అధికార పార్టీ వక్రీకరిస్తుంది

Madhu Yashki

Madhu Yashki

అమెరికాలో నిర్వహించిన తానా సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి రైతులకు ఉచిత్‌ విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అధికార పార్టీ వక్రీకరిస్తుందని ఆరోపించారు. కేటీఆర్.. రేవంత్ మాటలు వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉచిత కరెంట్ పై వెకిలి మాటలు మాట్లాడింది టీడీపీ అని, అప్పుడు కేసీఆర్.. బాబు పక్కనే ఉన్నాడన్నారు. వైఎస్‌ ఉచిత కరెంట్ ఇస్తాం అని…అమలు చేశారని గుర్తు చేశారు. బకాయిలు కూడా 1,250 కోట్లు మాఫీ చేశారన్నారు.

Also Read : Kodali Nani Health Condition: తనకు అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని..

ఎలాంటి ఒత్తిడికి లొంగ కుండా ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తమ్ముడు కేటీఆర్.. 24 గంటల పేరుతో కొన్న విద్యుత్ ఎంత… మీరు నొక్కింది ఎంత..? అని ఆయన ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ పేరుతో దోపిడీ చేస్తోంది మీరు అని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అభియోగం కూడా ఇదేనని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో జగదీష్ రెడ్డి… హరీష్ రావు ల పాత్ర కూడా ఉందని, రేవంత్ చెప్పింది… ఏంటి అంటే.. రైతులు మోసపోకండి… కేసీఆర్ దోపిడీ విచారిస్తాం అన్నారని మధు యాష్కీ వివరించారు.

Also Read : Kashmira Shah: 14 సార్లు నా భర్తతో ట్రై చేశా.. చివరికి ఆ స్టార్ హీరో వలనే తల్లిగా మారాను

రాహు కాలం ఉండేది రెండు గంటలు.. రావు ప్రభుత్వం రెండు విడతలేనని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మధు యాష్కీ ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇండ్లు… సబ్ స్టేషన్ ల ముందు ఆందోళన చేపట్టండి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు మధు యాష్కీ. అప్పుడు అసలు కరెంట్ ఎంత ఇస్తున్నారో బయట పడుతుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయని.. కేటీఆర్‌ మాటలు వక్రీకరించి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.

Exit mobile version