NTV Telugu Site icon

Madhu Yashki : రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ ఇచ్చిన కాంట్రాక్ట్‌ వివరాలు ఇవే…

Madhu Yashki

Madhu Yashki

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్‌ పార్టీని వీడిని రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీనే విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇచ్చిన 18వేల కోట్ల కాంట్రాక్ట్‌కు కోమటిరెడ్డి అమ్ముడుపోయారంటూ విమర్శలు గుప్పించారు. అయితే.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మాధు యాష్కీ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఇచ్చిన కాంట్రాక్టు ఇవే అంటూ వివరాలను వెల్లడించారు.
Also Read : Bandi Sanjay : ముఖ్యమంత్రి వచ్చేటప్పుడే డబ్బులు సంచులు తెస్తున్నాడట

బొగ్గు కుంభకోణం వివరాలు బయట పెడుతున్నామన్న మధు యాష్కీ… మునుగోడు ప్రజల్ని నిండా ముంచారని, రాజగోపాల్ రెడ్డి కి ఇచ్చిన బొగ్గు గనుల టెండర్ అని వెల్లడించారు. దాని విలువ.. రూ.3438 కోట్ల కాంట్రాక్టు అని, ఆదాయం 18,264 కోట్ల అని వెల్లడించారు. సుశి ఇన్ఫ్రా లాస్ లో ఉందని.. అలాంటి కంపెనీకి 18 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా బీజేపీ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఆధారాలు చూపెట్టు అంటున్నాడని, అందుకే బయట పెడుతున్నామన్నారు మధు యాష్కీ. మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి.. రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.

చిల్లి గవ్వ లేని తన కంపెనీ అభివృద్ధి కోసమే బీజేపీ లో చేరారని, చంద్రగుప్త బొగ్గు గని టెండర్ పొందారని, టెండర్ కోసం ఆయన కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ పాట పాడారంటూ మండిపడ్డారు. నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తో ఒప్పందం చేసుకున్నారని, రాజగోపాల్ రెడ్డి రాజకీయం అంతా బ్యాక్ డోర్ లాబీయింగ్ అంటూ ధ్వజమెత్తారు. 17 మార్చి 2022 లో బీజేపీ చేరను అని స్టేట్మెంట్ ఇచ్చారని, 19 మార్చ్ లో కోల్ ఇండియా అగ్రిమెంట్ జరిగిందని, పథకం ప్రకారం ఈ ఒప్పందం జరిగిందన్నారు. మునుగోడు ప్రజలు ఆలోచన చేయండని, ఎన్నికలు ప్రజల స్థితి గతులు మారాలి కానీ నాయకుల స్థితి గతుల కోసం కాదని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని, మునుగోడు తీర్పు టీఆర్‌ఎస్‌.. బీజేపీ దవడ తిరిగేలా ఇవ్వాలన్నారు.

టెండర్ ప్రక్రియ జాన్ 2020 లో జరిగిందని, అప్పుడు సుశి కంపనీ టెండర్ లేదన్నారు. జనవరి 2021 లో బేరసారాలు చేశారని, ఫిబ్రవరిలో ఆదానిని తప్పించి సుశి కి ఇచ్చారన్నారు. కేసీఆర్ పెద్ద దొంగ.. కేటీఆర్ చిన్న దొంగ.. తండ్రిని మించిన దొంగవుతాడు. టీఆర్‌ఎస్‌.. బీజేపీ మధ్య దొంగ నాటకాలు… ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు బీజేపీ.. టీఆర్‌ఎస్‌ వేస్తున్నాయి. భారత్ జోడో యాత్ర మునుగోడు ఎన్నికల కోసమో.. అసెంబ్లీ ఎన్నికల కోసమో కాదు.. భారత్ భవిష్యత్తు కోసం యాత్ర అని మధు యాష్కీ వ్యాఖ్యానించారు.